bellamkonda srinivas: 'సాక్ష్యం' మూవీ నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. శ్రీవాస్ 'సాక్ష్యం' సినిమాను రూపొందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'సౌందర్యలహరి' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.

'లహరి లహరి లహరి .. సౌందర్యలహరి' అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జితిన్ .. ఆర్తి ఆలపించారు. నాయకా నాయికల మధ్య కొనసాగే ఈ పాట .. దృశ్య పరంగా థియేటర్లో మరింతగా ఆకట్టుకుంటుందనే అనిపిస్తోంది. ఈ సాంగ్ యూత్ ను బాగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News