dasari: మన ఇంటి సమస్యను మనమే పరిష్కరించుకోవాలని దాసరి అనేవారు!: పవన్ కల్యాణ్
- దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచారు
- సినిమా రంగం అంతా ఒక కుటుంబమేనని దాసరి అనేవారు
- ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా నిర్ణయించడం సంతోషకరం
దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతిని డైరెక్టర్స్ డేగా నిర్ణయించడం చాలా సంతోషకరమని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన దాసరి నారాయణ రావు జయంతిని అందరూ చిరకాలం గుర్తు పెట్టుకునేలా నిర్ణయించిన దర్శకుల సంఘానికి, ఇందుకు చొరవ చూపిన ఆ సంఘం అధ్యక్షుడు శంకర్‌కి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
దాసరి నారాయణ రావు నటుడిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ సేవల్ని అందించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. సినిమా రంగం అంతా ఒక కుటుంబమని, మన ఇంటి సమస్యను మనమే చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నది ఆయన భావన అని అన్నారు.