Guntur District: దాచేపల్లి నిందితుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న బంధువులు

  • చెట్టుకి ఉరి వేసుకుని సుబ్బయ్య ఆత్మహత్య
  • చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న బంధువులు
  • మృతుడి కాళ్లు నేలను తాకినట్లుగా ఉన్నాయని అనుమానం
గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం జరిపిన ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య.. గురజాల మండలం దైద అమరలింగేశ్వర ఆలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సుబ్బయ్యేనని హోంమంత్రి చినరాజప్ప ప్రకటన చేశారు.

అయితే, సుబ్బయ్య మృతిపై ఆయన బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫొటోను చూపించారని, అందులో మృతుడి కాళ్లు నేలను తాకినట్లుగా ఉన్నాయని, ఉరి వేసుకుంటే అదెలా సాధ్యమని ప్రశ్నించారు.
Guntur District
dachepally
rape

More Telugu News