railway station: దేశంలో అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్ల జాబితా విడుదల

  • ప్రకటించిన రైల్వే మంత్రిత్వ శాఖ
  • చంద్రాపూర్‌, బలార్షా రైల్వే స్టేషన్లకు అగ్రస్థానం
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మూడో స్థానం
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, బలార్షా రైల్వే స్టేషన్లు దేశంలోనే అత్యంత సుందరమైన స్టేషన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. దేశంలో అత్యంత సుందరమైన స్టేషన్ల జాబితాను ఈ రోజు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేయగా.. అందులో ఈ స్టేషన్ల తరువాత బీహార్‌లోని మధుబని, తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో గుజరాత్‌లోని గాంధీ ధామ్‌, తెలంగాణలోని సికింద్రాబాద్‌, రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్లు నిలిచాయి. సుందరమైన స్టేషన్ల జాబితాను శుభ్రత, పారిశుద్ధ్యతా ప్రమాణాల ఆధారంగా రూపొందించామని రైల్వే మంత్రిత్వ శాఖ వివరించింది.
railway station
secunderabad
Rajasthan

More Telugu News