Andhra Pradesh: నిందితుడు సుబ్బయ్య కుటుంబసభ్యులు వైసీపీ సానుభూతిపరులే!: ఎమ్మెల్యే యరపతినేని

  • సుబ్బయ్య సోదరుడి కొడుకు చిట్టినాయుడు గురజాల వైసీపీ నేత
  • వైసీపీ ఫ్లెక్సీలలో సుబ్బయ్య కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయి
  • నిందితుడిని పట్టుకుని తీరతాం
దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య కుటుంబ సభ్యులు వైసీపీ సానుభూతిపరులేనని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని అన్నారు.

నిందితుడి కోసం 15 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిందితుడు సుబ్బయ్య సోదరుడి కుమారుడు చిట్టినాయుడు గురజాల వైసీపీ నాయకుడని, వైసీపీ ఫ్లెక్సీలలో సుబ్బయ్య కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, నిందితుడిని పట్టుకుని తీరతామని చెప్పారు.
Andhra Pradesh
mla yarapatineni

More Telugu News