Nagarjuna: చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకు వచ్చిన సుమంత్, సుప్రియ

  • 'నరుడా డోనరుడా' సహ నిర్మాత కేసు
  • చెక్కులు బౌన్స్ అయ్యాయని ఫిర్యాదు
  • కేసు తదుపరి విచారణ వాయిదా
గతంలో తమపై నమోదైన చెక్ బౌన్స్ కేసు విచారణలో భాగంగా మార్కాపురం మేజిస్ట్రేట్ కోర్టుకు హీరో అక్కినేని నాగార్జున మేనల్లుడు, నటుడు సుమంత్, మేనకోడలు సుప్రియ హాజరయ్యారు. గతంలో తీసిన 'నరుడా డోనరుడా' సినిమా వ్యవహారంలో సహ నిర్మాతలకు వీరిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి.

దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా కేసు నమోదైంది. గత వాయిదాలకు వీరు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక సుమంత్, సుప్రియలు కోర్టుకు రావడంతో వారెంట్లను రీకాల్ చేసిన న్యాయమూర్తి పఠాన్ షియాజ్, కేసును జూన్ 28కి వాయిదా వేశారు.
Nagarjuna
Sumant
Supriya
Cheque Bounce
Markapuram

More Telugu News