Tamilnadu: ఎవరి బెదరింపులకు భయపడే ప్రసక్తే లేదు: హీరో విజయ్ తండ్రి చంద్రశేఖరన్

  • ట్రాఫిక్ రామస్వామి మాదరిగానే నేను కూడా పోరాడుతుంటా
  • నా  తొలి చిత్రం సమయంలోనే ఎన్నో బెదిరింపులు వచ్చాయి
  • అప్పుడే లెక్కచేయలేదు .. ఇప్పుడెందుకు భయపడతా?
 సమాజంలో జరిగే అన్యాయాలపై పోరాటం చేస్తున్న ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఎ చంద్రశేఖర్ ట్రాఫిక్ రామస్వామి పాత్రను పోషించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఎవరి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని, రామస్వామి మాదరిగానే తాను కూడా సమాజంలో జరిగే సంఘటనలపై గట్టిగా పోరాటం చేస్తుంటానని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

తన తొలి చిత్రం ‘ఒరు ఒరుట్టరై’ సమయంలోనే తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అప్పుడే భయపడని తాను ఇప్పుడెందుకు భయపడతానని అన్నారు. తన శిష్యుడు విక్కీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని, ఈ సినిమా కథ చెప్పినప్పుడే తనకు బాగా నచ్చిందని చెప్పిన చంద్రశేఖరన్, ఇప్పటివరకూ 69 చిత్రాలకు దర్శకత్వం వహించానని అన్నారు. ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని అన్నారు. కాగా, ఈ సినిమాలో విజయ్, కుష్బూ, సీమాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  
Tamilnadu
chanrashekaran

More Telugu News