Twitter: ఆడపిల్లలు వంటింట్లో వంట నేర్చుకోవాలంటూ తమిళ కమెడియన్‌ ట్వీట్‌.. మండిపడ్డ నెటిజన్లు

  • వేసవి వచ్చేసింది అంటూ వివేక్‌ ట్వీట్‌
  • ఆడపిల్లలు వంటింట్లో సాయంగా ఉండాలని వ్యాఖ్య
  • మగపిల్లలు తండ్రి దగ్గర పని నేర్చుకోవాలని సూచన
ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఆయన అందులో పేర్కొన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండడమే అందుకు కారణం. 'ప్రియమైన విద్యార్థులారా.. వేసవి వచ్చేసింది' అంటూ ఆయన పిల్లలకు కొన్ని సూచనలు చేశాడు. సెలవులను ఆస్వాదించాలని, ఆటలాడిన తరువాత నీళ్లు ఎక్కువగా తాగండని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాత ఆడ పిల్లలూ వంటగదిలో మీ అమ్మకు సాయంగా ఉండండి అని, వంట నేర్చుకోండని, ఇక మగ పిల్లలు తమ తండ్రి పని ప్రదేశానికి వెళ్లి, కుటుంబం కోసం ఆయన ఎలా పనిచేస్తున్నారో చూడండని, బలంగా ఉండండని పేర్కొన్నాడు.

దీంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆడపిల్లలేమో వంట నేర్చుకోవాలి, మగ పిల్లలేమో ఆఫీస్‌కి వెళ్లాలా? అని మండిపడుతున్నారు. ఆడపిల్లలు అంతరిక్షయానంలోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారని, మళ్లీ వంటింటి కుందేళ్లు కావాలా? అని మరికొందరు అంటున్నారు. 
Twitter
vivek
fire

More Telugu News