Andhra Pradesh: ఒంగోలు స్టేషన్ లో నిలిచిపోయిన కేరళ, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు

  • ప్రకాశం జిల్లాలో రైల్వే లైన్ కు విద్యుత్ సరఫరాలో అంతరాయం
  • సింగరాయకొండ స్టేషన్ లో నిలిచిపోయిన కృష్ణా ఎక్స్ ప్రెస్  
  • ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు
ఏపీలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రకాశం జిల్లాలో రైల్వే లైన్ కు విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రైళ్లు నిలిచిపోయాయి. ఒంగోలు స్టేషన్ లో కేరళ, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు, సింగరాయకొండ స్టేషన్ లో కృష్ణా ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటల నుంచి కృష్ణా ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

కాగా, ఏపీలో వర్షబీభత్సానికి ఆరుగురు మృతి చెందారు. పిడుగుపాటుకు గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒక మహిళ, కర్నూలు నరసింహారెడ్డి నగర్ లో చెట్టు కూలి ఒక బాలుడు, గుంటూరులోని లక్ష్మీపురంలో హోర్డింగ్ కూలి ఒకరు మృతి చెందారు.
Andhra Pradesh
rajadhani express

More Telugu News