Jagan: దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే: దాచేపల్లి ఘటనపై జగన్‌ ట్వీట్

  • ఏపీలో కొన్ని నెలలుగా ఇటువంటి ఘటనలు పెరిగిపోయాయి
  • నిందితులకు శిక్షలు పడడం లేదు
  • చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా?
గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా ఇటువంటి దారుణ ఘటనలు పెరిగిపోయాయని, ఈ సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు.

నిందితులకు శిక్షలు పడకుండా పోతుండడంతోనే ఏపీలో ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? అని జగన్ ప్రశ్నించారు. కాగా, చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దాచేపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
Jagan
YSRCP
Guntur District

More Telugu News