Pawan Kalyan: దాచేపల్లి ఘటన నా మనసుని కలచి వేసింది.. పబ్లిక్‌గా శిక్షించే విధానం రావాలి: పవన్ కల్యాణ్‌

  • పౌర సమాజం తీవ్ర వేదనకి గురవుతోంది
  • సర్కారు ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలి
  • ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలి
  • అందుకు పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలి
గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కథువా నుంచి కన్యాకుమారి వరకు జరుగుతోన్న అత్యాచార ఘటనలపై విన్నప్పుడల్లా తనతో పాటు పౌర సమాజం తీవ్ర వేదనకి గురవుతోందని ట్వీట్‌ చేశారు. ఈ రోజు దాచేపల్లి ఘటన కూడా తన మనసుని కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అసలు ఆడబిడ్డపైన ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana Sena
Twitter
Guntur District

More Telugu News