Supreme Court: ప్రధాని అందుబాటులో లేరని సుప్రీంకోర్టుకు చెప్పిన ఏజీ... న్యాయమూర్తి మండిపాటు!

  • కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ
  • నదీ జలాల బోర్డుపై ముసాయిదా సిద్ధమైందన్న ఏజీ
  • కేబినెట్ ఆమోదించాల్సి వుందని వెల్లడి
  • కేసు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ, నదీజలాల బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అందుబాటులో లేరని, ఆయన కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున కేసు విచారణ పది రోజుల పాటు వాయిదా వేయాలని అటార్నీ జనరల్ కోరగా, న్యాయస్థానం మండిపడింది. కేసును కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న న్యాయమూర్తి, తక్షణమే తమిళనాడుకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.

అంతకుముందు ఏజీ కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తూ, కావేరీ బోర్డు మేనేజ్ మెంట్ డ్రాఫ్ట్ సిద్ధమైందని, అయితే, ప్రధాని అందుబాటులో లేని కారణంగా కేబినెట్ ఆమోదించలేదని తెలిపారు. ఆయన వాదనలు విన్న తరువాత ముసాయిదా ప్రతిపాదనలను న్యాయస్థానానికి అందించాలని ఆదేశిస్తూ, కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
Supreme Court
Narendra Modi
River Kaveri
Tamilnadu
Karnataka

More Telugu News