prabhas: చైనాలో 7000 స్క్రీన్లకి పైగా 'బాహుబలి 2' రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రంగా 'బాహుబలి 2' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి ప్రేక్షకులతో 'జయహో' అనిపించుకుంది. అలా ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ సినిమా, 100 రోజులను పూర్తి చేసుకుని, ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. వసూళ్ల విషయంలోను అదే విధంగా హల్ చల్ చేస్తోంది.

 ఇక చైనాలో రేపు ఈ సినిమా 7000 పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. చైనాలో ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదలవుతోన్న ఇండియన్ సినిమాగా, ఇప్పటికే ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించడం ఖాయమనీ .. కొత్త రికార్డులకు తెరదీసి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
Go Back to Shorts
prabhas
anushka
tamannah

More Telugu News