nirmala: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం

  • తమిళనాడులోని రామ్‌నాథ్‌పురంలో ఘటన
  • కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరిన డీఎంకే కార్యకర్తలు
  • కావేరీ మేనేజిమెంట్ బోర్డు ఏర్పాటులో జాప్యతపై ఆందోళన
తమిళనాడులోని రామ్‌నాథ్‌పురం పార్దీబనూర్ జంక్షన్ వద్ద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ పథకం 'గ్రామ్ స్వరాజ్ అభియోన్' అమలును సమీక్షించేందుకు అక్కడకు వెళ్లిన నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు  రాళ్లు, చెప్పులు విసిరి రచ్చ రచ్చ చేశారు.

కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు తీరు పట్ల నిరసన తెలుపుతూ డీఎంకే కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను ముందుకు రాకుండా అదుపు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జంక్షన్‌ వద్ద డీఎంకే ఆందోళనకారులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి కూడా దిగారు. పోలీసులు చివరకు అందరినీ అదుపు చేశారు.
nirmala
Tamilnadu
agitation

More Telugu News