సినిమా సీన్లను తలపించేలా.. పెళ్లి కూతురి మెడలోంచి తాళిబొట్టు కొట్టేసిన దొంగలు
- కామారెడ్డి జిల్లాలో ఘటన
- హైదరాబాద్ నుంచి వచ్చిన దొంగలు
- వధువు మెడలో దండ సర్దుతూ చోరీ
- కారులో పారిపోతుండగా పట్టుకున్న బంధువులు
హైదరాబాద్ నుంచి ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్ ఆ వివాహవేడుకకు వచ్చారు. బంధువుల్లా అందరినీ పలకరిస్తూ అన్ని పనులు తామే చేస్తున్నట్లు పోజులుకొట్టారు. చివరకు వధువు మెడలో దండ సర్దుతూ తాళిబొట్టు చోరీ చేశారు. కొద్ది సేపటికి విషయాన్ని గుర్తించి పెళ్లి కూతురు చెప్పడంతో బంధువులంతా కలిసి దొంగలను పట్టుకోవడానికి పరుగులు తీశారు. కారులో పరారవుతున్న దొంగలను ఎట్టకేలకు తమ గ్రామంలోనే ఓ చోట పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.