Karnataka: కర్ణాటక ఎలెక్షన్స్.. ఫుల్లు బిజీగా హిజ్రాలు!

  • హిజ్రాలు ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం
  • కోరినంత డబ్బు ఇచ్చి ప్రచారం చేయిస్తున్న అభ్యర్థులు
  • హైదరాబాద్, చెన్నైల నుంచి బెంగళూరుకు హిజ్రాలు
కర్ణాటక ఎన్నికలు హిజ్రాలకు రెండు చేతులా సంపాదనను తెచ్చిపెడుతున్నాయి. హిజ్రాలు ప్రచారం చేస్తే మేలు చేకూరుతుందనే నమ్మకం నేపథ్యంలో వారి పంట పండుతోంది. చాలా మంది అభ్యర్థులు ప్రచారం కోసం హిజ్రాలను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులోని మొత్తం 28 నియోజకవర్గాల్లో హిజ్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కోరినంత డబ్బు ఇచ్చి వీరిని తమ వెంట ప్రచారానికి తీసుకెళుతున్నారు. హైదరాబాద్, చెన్నైల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హిజ్రాలు బెంగళూరుకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు.
Karnataka
elections
hijra
demand
campaign

More Telugu News