kota srinivasa rao: ఇప్పటి సినిమాలపై స్పందించిన కోట శ్రీనివాసరావు

  • ఇప్పటి కథల్లో కొత్తదనం ఉండదు 
  • పంచ్ లు హాస్యం కిందికి రావు 
  • కథకి .. టైటిల్ కి పొంతన ఉండదు
రంగస్థలం నుంచి చిత్రపరిశ్రమకి వచ్చిన కోట శ్రీనివాసరావు, అసమానమైన తన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి కోట శ్రీనివాసరావు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పటి సినిమాలను గురించి ప్రస్తావించారు.

 ఇప్పుడొస్తోన్న సినిమాల్లో చాలావరకూ మామూలువే .. కథలు వెరైటీగా ఉండవ్. జంధ్యాల సినిమాల్లోని హాస్య సన్నివేశాలను గురించి ఎంతమంది సమక్షంలోనైనా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తోన్న కామెడీ సీన్స్ ను అటూ ఇటూ చూసి ఎవరూ లేకుండగా చెప్పుకోవాలి. విషయంలేని పంచ్ లు హాస్యమెలా అవుతాయి? ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు ఇద్దరు స్టార్ హీరోలు ఉండగా, 'గుండమ్మ కథ' అనే పేరు పెట్టిన రోజులున్నాయి. ఇప్పటి టైటిల్స్ కి ..  సినిమాలకి సంబంధం ఉండదు. సినిమా మూడు వారాలు ఘనంగా ఆడుతోందని చెబుతారు. మూడు వారాలు అంటే శుక్ర .. శని .. ఆదివారాలు అని అర్థం" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.      
kota srinivasa rao

More Telugu News