KCR: కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్‌ భేటీ

షార్ట్స్‌లో చూడండి
దేశంలో గుణాత్మక మార్పే తన ధ్యేయమంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకు ముందు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేష్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌ చేరుకున్న అఖిలేష్‌ యాదవ్‌.. ప్రగతి భవన్‌లో తేనీటి విందులోనూ పాల్గొన్నారు.    
Go Back to Shorts
KCR
akhilesh
Hyderabad

More Telugu News