Andhra Pradesh: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా!

  • ఇంజనీరింగ్ విభాగంలో 72.28 శాతం ఉత్తీర్ణత
  • అగ్రికల్చర్ విభాగంలో 87.6 శాతం ఉత్తీర్ణత
  • ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 1,90,922 మంది విద్యార్థులు హాజరవ్వగా, 73,373 మంది విద్యార్థులు అగ్రి, మెడికల్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 72.28 శాతంతో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87.6 శాతంతో 63,883 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. కాగా ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Andhra Pradesh
ap emcet

More Telugu News