mahanati: 'మహానటి' ఆడియో ఫంక్షన్ లో మహానటుడితో మాట్లాడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా: జబర్దస్త్ మహేష్

  • నిన్న జరిగిన 'మహానటి' ఆడియో ఫంక్షన్
  • ఎన్టీఆర్ తో జరిగిన సంఘటనని తలచుకుని పొంగిపోయిన మహేష్
  • ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎందుకయ్యారో అర్ధమైంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన జబర్దస్త్ కమేడియన్ మహేష్ నిన్న జరిగిన 'మహానటి' ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తో జరిగిన సంఘటనని తలచుకుని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

"బ్రదర్ మీరు షేక్ చేశారు.. అదిరిపోయింది.. చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినప్పుడు.. మనం కలుద్దాం. ఇవి ఎన్టీఆర్ అన్న తనతో మాట్లాడిన గోల్డెన్ వర్డ్స్ అని, కింద కూర్చుని అన్నతో మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్.. అంటూ పైన కూర్చుంటేనే కానీ ఊర్కోలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఆయన అంత గొప్పవాడు ఎందుకయ్యారో అని. లవ్ యూ సో మచ్ ఎన్టీఆర్ అన్న. మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, మహానటుడితో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్యూ సో మచ్ నాగ అశ్విన్ సార్’’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.
mahanati
jrntr
Tollywood
jabardasth

More Telugu News