Maghadheera: రామ్ చరణ్ కు హిట్ ఇవ్వలేకపోయా... ఈ బాధ తగ్గేది కాదు: నాగబాబు

  • 'మగధీర' తరువాత 'ఆరంజ్' తీశాను
  • ఫ్లాప్ కావడంతో చాలా బాధపడ్డాను
  • ఆ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే హిట్ అయ్యేదన్న నాగబాబు
గతంలో తాను నిర్మాతగా పలు చిత్రాలను తీసినప్పటికీ, రామ్ చరణ్ కు ఓ హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ తనకు ఇప్పట్లో తగ్గేది కాదని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన సమర్పణలో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమైన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' విడుదలకు సిద్ధం కాగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగబాబు ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 'మగధీర' వంటి సూపర్ హిట్ ను అందుకున్న రామ్ చరణ్ కు ఆ వెంటనే మరో హిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే 'ఆరంజ్' తీశానని, కానీ, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. నిర్మాతగా తాను పనికిరానన్న భావనతోనే ఆపై సినిమాలు తీయలేదని, సీరియల్స్ తీస్తూ, టీవీ షోలు చేస్తూ గడిపానని అన్నారు. 'ఆరంజ్' ఇప్పుడు విడుదలై ఉంటే మంచి హిట్ అయ్యుండేదని అనుకుంటున్నట్టు చెప్పారు.

తన కుమారుడు వరుణ్ విజయాలను చవిచూస్తున్నాడని, కుమార్తె నీహారిక మంచి రోల్స్ ఎంచుకుంటూ కెరీర్ ను డెవలప్ చేసుకుంటోందని, తాను రియాల్టీ షోలతో బిజీగా ఉన్నానని, ఇదే తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ అని నాగబాబు అభిప్రాయపడ్డారు.
Maghadheera
Orange
Nagababu
Ramcharan

More Telugu News