Mahanati: జబర్దస్త్ మహేష్ కు కౌంటరిచ్చిన రాజేంద్రప్రసాద్ మనవరాలు... చూడండి!

  • గత రాత్రి 'మహానటి' ఆడియో ఫంక్షన్
  • చిన్న సావిత్రిగా నటించిన నటకిరీటి మనవరాలు
  • క్యూట్ గా మాట్లాడి ఆకట్టుకున్న నిశంకర సావిత్రి
ప్రఖ్యాత నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా, కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మహానటి' ఆడియో ఫంక్షన్ జరుగుతున్న వేళ, ఈ చిత్రంలో సావిత్రి చిన్నప్పటి పాత్రలో నటించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నిశంకర సావిత్రి, అదే కార్యక్రమానికి సహ వ్యాఖ్యతగా ఉన్న జబర్దస్త్ కమేడియన్ మహేష్ కు కౌంటరేసింది. సావిత్రి గురించి ఏదైనా చెప్పాలని అడగ్గా, అస్సలు చెప్పనని మొండికేసింది. వాళ్ల తాతయ్య ఏమీ చెప్పవద్దన్నాడని అంది. క్యూట్ గా ఉన్న నిశంకర సావిత్రి మాటలు అక్కడున్న వాళ్లందరినీ నవ్వించాయి. కాగా, అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'మహానటి'లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.
Mahanati
Savitri
Rajendraprasad
Audio Function

More Telugu News