Pawan Kalyan: ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. పార్టీ వ్యూహకర్తగా దేవ్‌

  • హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం
  • ప్రణాళికబద్ధంగా అడుగులు వేద్దామని పిలుపు 
  • తమకు అనుభవం ఉందని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేద్దామని అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్‌ను పరిచయం చేశారు. జనసేనకు అనుభవం లేదంటూ ప్రత్యర్థులు చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమని, గత రెండు ఎన్నికల్లో పని చేసిన అనుభవం జనసేన కార్యకర్తలది అని పవన్ వ్యాఖ్యానించారు.        
Pawan Kalyan
Jana Sena
Hyderabad

More Telugu News