Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. సినిమా థియేటర్‌లో బాలికపై అత్యాచారం

  • బోరబండలో ఘటన
  • సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు
  • దర్యాప్తు ప్రారంభం
బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్ని చట్టాలు వచ్చినా అటువంటి దారుణాలకి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. కథువాలో జరిగిన దారుణ ఘటన తరువాత అటువంటి నేరస్తులకి మరణశిక్ష విధించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటికీ మృగాళ్లు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. హైదరాబాద్‌ బోరబండలోని ఓ సినిమా థియేటర్లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

నిన్న థియేటర్‌లో తమ కూతురిపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఈ రోజు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  
Hyderabad
theatre
minor girl

More Telugu News