sangeeta: ఓ మేనేజర్ వలన మోసపోయాను .. లేదంటే మరింత పేరు వచ్చేది: సీనియర్ నటి సంగీత

  • సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లాము 
  • అక్కడ మాకు ఎవరూ తెలియదు 
  • అప్పుడు ఆయన తారసపడ్డాడు   
కథానాయికగాను .. ముఖ్యమైన పాత్రల్లోను సంగీత తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి సంగీత తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పారు. "సినిమా పరిశ్రమ చెన్నైలో ఉండగా అక్కడ మాకు ఎవరూ తెలియదు. అయినా నేను .. మా అమ్మ .. అన్నయ్య కలిసి అక్కడికి వెళ్లాం"

"పాండి బజార్లో ఒక మేనేజర్ మా అన్నయ్యకి కలిశాడు .. ఆయన ద్వారానే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది. నాకు తెలియకుండా ఆ మేనేజర్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం .. నా వరకూ ఎవరినీ రానీయకపోవడం జరిగాయి. ఆ విషయం నాకు తెలిసేసరికి బాగా ఆలస్యమైపోయింది. ఈ విషయాన్ని నేను ముందుగానే గ్రహించి వుంటే నాకు మరిన్ని అవకాశాలు .. మరింత పేరు వచ్చి ఉండేవి" అంటూ చెప్పుకొచ్చారు.    
sangeeta

More Telugu News