Social Media: కడపలో వైరల్ అవుతున్న ఊచకోత దృశ్యాలు... కత్తులు పట్టుకుని తిరుగుతున్న యువకులు!

  • ఎక్కడో తీసిన దృశ్యాలను వైరల్ చేస్తున్న కొందరు
  • ఆందోళనతో గ్రామాలకు కాపలా కాస్తున్న యువకులు
  • నమ్మవద్దని పోలీసుల హితవు
ఎవరు ఎలా వైరల్ చేస్తున్నారో తెలియడం లేదుగానీ, ఏదో దేశంలో జరిగిన ఊచకోత దృశ్యాలను పనిగట్టుకుని కడప ప్రాంతంలో కొందరు వైరల్ చేస్తుండగా, యువకులు కత్తులు పట్టుకుని రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా పెనగలూరు పరిసరాల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

పలు అవాంఛిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అటువంటివి తమకు ఎదురవుతాయేమోనని పలు గ్రామాల్లో యువకులు పహారా కాస్తున్నారు. ఈ గ్రామాల మీదుగా వెళ్లే వాహనాలను కూడా తనిఖీలు చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడో తీసిన దృశ్యాలను చాలా మంది ప్రజలు గుడ్డిగా నమ్ముతుండగా, ఇటువంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు.
Social Media
Viral
Kadapa
Penagaluru

More Telugu News