sangeeta: ఎన్టీఆర్ అంకితభావం ప్రత్యక్షంగా చూశాను: సీనియర్ హీరోయిన్ సంగీత

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కలుపుకుని, దాదాపు 600 సినిమాల్లో సంగీత నటించారు. మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఆమె, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో కలిసి నటించిన అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.

 'శ్రీరామ పట్టాభిషేకం'లో ఎన్టీఆర్ గారితో కలిసి నటించాను. ఆ సినిమాలో ఆయన రాముడిగాను .. రావణుడిగాను వేశారు .. నేను సీత పాత్రను పోషించాను. సాధారణంగా మేము పౌరాణికాలు చేస్తే .. షాట్ పూర్తి కాగానే మరో షాట్ వరకూ, చిరాకు పెడతాయని ఆభరణాలు తీసేస్తుంటాం. కానీ ఆయన ఉదయం ఆరుగంటలకు ధరించిన కిరీటం .. ఆభరాణాలు పేకప్ చెప్పేవరకూ తీసేవారు కాదు. ఆయన అంకితభావం చూసి నేను ఆశ్చర్యపోయేదానిని. ఒకసారి తెల్లవారు జామున 3 గంటలకు నన్ను మేకప్ చేయించి సెట్ కి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన ఫుల్ మేకప్ తో రెడీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
sangeeta
ntr

More Telugu News