priyanka chopra: పెళ్లి వార్తలపై ప్రియాంకా చోప్రా స్పందన

  • ప్రియాంక చేతికి మంగళసూత్రంలాంటి బ్రేస్ లెట్
  • సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందంటూ వదంతులు
  • అందరికీ చెప్పే చేసుకుంటానన్న ప్రియాంక
బాలీవుడ్ అగ్రనటి ప్రియాంకా చోప్రా... హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. క్వాంటికో, బేవాచ్ లలో ఆమె తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా తన నటనను కొనసాగిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది.

మరోవైపు, ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనే వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. తన చేతికి మంగళసూత్రంలా ఉన్న ఒక బ్రేస్ లెట్ ను ఇటీవల ప్రియాంక ధరించింది. దీంతో, ఆమె సీక్రెట్ వివాహం చేసుకుందనే వార్తలు కూడా వెల్లువెత్తాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, తన పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఆపాలని కోరింది. దిష్టి తగలకుండా ఉండేందుకే తాను దీన్ని ధరించానని క్లారిటీ ఇచ్చింది. తాను సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోనని... అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది. 
priyanka chopra
marriage
bollywood
bracelet

More Telugu News