Rangasthalam: అధికారిక ప్రకటన... రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిన 'రంగస్థలం'!

  • మార్చి 30న విడుదలైన 'రంగస్థలం'
  • నెల రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లు
  • 'బాహుబలి' తరువాత హయ్యస్ట్ గ్రాసర్
రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' చిత్రం రూ. 200 కోట్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం నెల రోజుల వ్యవధిలోనే ఇంత భారీ కలెక్షన్లు రాబట్టి, 'బాహుబలి' చిత్రాల తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది. మరోవైపు రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' ఇప్పటికే రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, 'రంగస్థలం'తో పోటీపడుతూ దూసుకెళుతోంది.
Rangasthalam
Bharath Ane Nenu
Bahubali
Collections

More Telugu News