Chandrababu: వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను.. వీడియోలో చూపించిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
మొదటి ధర్మ పోరాటం తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు తిరుపతిలో నిర్వహిస్తోన్న ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ... 'నాలుగేళ్ల కంటే ముందు ఇదే రోజు, ఇదే సమయంలో మోదీ వెంకటేశ్వరుడి సాక్షిగా హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాం. మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ సభ పెట్టాం. నాలుగేళ్లు ఓపిక పట్టి ప్రయత్నం చేశాం' అని అన్నారు.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశం ఆశ్చర్యపోయే విధంగా ఏపీ కొత్త రాజధానిని నిర్మిస్తామని ఆనాడు మోదీ చెప్పిన మాటలను వీడియో ద్వారా చంద్రబాబు చూపించారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేసి చూపిస్తామని మోదీ అన్న వీడియోలన్నింటినీ చంద్రబాబు ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఇవి నరేంద్ర మోదీ చెప్పిన మాటలు కావా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఢిల్లీ కూడా చిన్నబోయే విధంగా రాజధాని కడతామని చెప్పిన మోదీ.. ఇప్పుడు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు.    
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Narendra Modi

More Telugu News