Balakrishna: ఇటీవల హిందీలో రెండు, మూడు మాటలు అన్నాను.. దానర్థం ఇదే!: బాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ ఏట దీక్షకు దిగారని, ఇప్పుడు ఈ సభ నిర్వహిస్తున్నామని, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఈ రోజు తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ... "ఈ సభకు మంచి పేరు పెట్టారు.. నమ్మకద్రోహం, కుట్రరాజకీయాలపై ధర్మ పోరాటం అని. నేను ఆనాడే చెప్పాను.. ఇటీవల దీక్ష రోజున హిందీలో కూడా రెండు, మూడు మాటలు అన్నాను.. దానర్థం కూడా ఇదే.

మంచి ఘాటుగానే ఇచ్చాను ఆ రోజు. తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగేళ్లుగా ఎదురు చూస్తోన్న తర్వాతే పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం" అని అన్నారు.
Go Back to Shorts
Balakrishna
Tirupati
Narendra Modi

More Telugu News