Nara Lokesh: ప్రతి శుక్రవారం చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడు!: జగన్‌పై నారా లోకేశ్‌ నిప్పులు

  • 12 కేసుల్లో ఏ1 ముద్దాయి
  • జగన్ ఒక 420
  • ఆయన మీకు గొప్ప నాయకుడిగా అనిపిస్తే పొత్తు పెట్టుకోండి
  • టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తే ఊరుకోం
వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారని, ఆయనొక 420 అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రతి శుక్రవారం జగన్ చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడని, మీకు ఆయన గొప్ప నాయకుడిగా అనిపిస్తే ఆయనతో పొత్తు పెట్టుకోండని బీజేపీని విమర్శించారు. అంతేగానీ, టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తే, ఏపీ ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం సహించబోమని అన్నారు.

ఈ రోజు తిరుపతిలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో నారా లోకేశ్‌ మాట్లాడుతూ... "ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోదీ.. ఇవ్వనిది మోదీ. కానీ మోదీకి వ్యతిరేకంగా జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడరు. జగన్, నీకు దమ్ముంటే మోదీని ఒక్క సారి విమర్శించు. నిరంతరం మన రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తి చంద్రబాబు.

నేను ఈ రోజు బీజేపీకి సవాలు విసురుతున్నాను. నాపై ఆరోపణలు విసిరే ముందు వాటికి ఆధారాలను ప్రజల ముందు పెట్టండి. అర్థంలేని ఆరోపణలు చేయకండి. నా వయసు 34 సంవత్సరాలు. ఇంకా 40 ఏళ్లు ఏపీ రాజకీయాల్లో ఉండాలన్న కోరిక ఉంది. నేను మళ్లీ చెబుతున్నా.. మా తాత, నాన్నలా నాకు మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ, వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 25కి 25 లోక్‌సభ సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతారు" అని అన్నారు.
Nara Lokesh
Jagan
Telugudesam

More Telugu News