dasari: దాసరి జయంతిని 'దర్శకుల దినోత్సవం'గా ప్రకటించిన దర్శకుల సంఘం

  • వచ్చేనెల 4న దాసరి జయంతి
  • హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో కార్యక్రమం
  • హాజరు కానున్న ప్రముఖ దర్శకులు
వచ్చేనెల 4వ తేదీన దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేపథ్యంలో ఆయనకు నివాళులర్పిస్తూ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి ప్రముఖ దర్శకులంతా హాజరవుతారని దర్శకుల సంఘం ప్రకటించింది. అదే రోజున ఛాంబర్‌ ఆవరణలోనే దాసరి నారాయణరావు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లు తెలిపింది.

అలాగే, 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన జయంతిని 'డైరెక్టర్స్‌ డే'గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. దాసరి నారాయణ రావు గతేడాది మే నెలలో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 
dasari
Hyderabad
Tollywood

More Telugu News