Kollu Ravindra: జగన్ ది సొంత ఎజెండా కాదు: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

  • బీజేపీ ఎజెండానే వైసీపీ ఎజెండా
  • చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని నిలదీయాలి
  • టీడీపీపై బురదచల్లడమే వైసీపీ నేతల పని
వైసీపీ అధినేత జగన్ కు సొంత ఎజెండా లేదని, బీజేపీ ఎజెండానే జగన్ ఎజెండా అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరగనున్న ధర్మ పోరాట దీక్షకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేపట్టిన దీక్షను హైజాక్ చేసేందుకే విశాఖపట్నంలో వైసీపీ సభ పెట్టిందని మండిపడ్డారు.

నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రధాని మోదీ ఇంత మోసం చేస్తున్నా... వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. టీడీపీపై, టీడీపీ నేతలపై బురదచల్లడమే వైసీపీ నేతల పని అని దుయ్యబట్టారు.
Kollu Ravindra
jagan
Chandrababu
Narendra Modi

More Telugu News