Chandrababu: తిరుపతి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో 'ధర్మపోరాట సభ' ప్రారంభం

  • మోదీ సర్కారు తీరుకి నిరసనగా దీక్ష
  • సభ ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
  • శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని మోదీ సర్కారు చేసిన అన్యాయానికి నిరసనగా తిరుపతిలో టీడీపీ నిర్వహించతలపెట్టిన 'ధర్మపోరాట సభ' కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎన్నికల ముందు ఏపీకి మోదీ ఇచ్చిన హామీలను వివరిస్తూ కేంద్ర సర్కారుని ఎండగట్టనుంది. తిరుపతిలోని తారకరామ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన శ్రీవారిని దర్శించుకుని, ఆ తరువాత సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, చేస్తోన్న కుట్ర రాజకీయాలను తాము ఎండగడతామని టీడీపీ నేతలు అంటున్నారు. 
Chandrababu
Andhra Pradesh
Tirupati

More Telugu News