kcr: కనిమొళితో భేటీ అయిన కేసీఆర్

  • చెన్నైలో కనిమొళితో కేసీఆర్ సమావేశం
  • ఫ్రంట్, రాజకీయ పరిణామాలపై చర్చ
  • భేటీకి హాజరైన కేకే, ఈటల, వినోద్
డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. నిన్న కరుణానిధి, స్టాలిన్ లతో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మంచి మిత్రుడని... ఆయనతో కూడా చర్చలు జరుపుతామని తెలిపారు. 
kcr
kanimozhi
federal front
chennai

More Telugu News