brett lee: మారువేషంలో వచ్చి.. చిన్నారులతో బ్రెట్ లీ క్రికెట్.. వీడియో చూడండి

  • వృద్ధుడి వేషంలో చిన్నారుల వద్దకు బ్రెట్ లీ
  • బౌలింగ్, బ్యాటింగ్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన చిన్నారులు
  • చివరకు బ్రెట్ లీ అని తెలుసుకుని ఆనందానికి లోనైన చిన్నారి క్రికెటర్లు
ఐపీఎల్ కు ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండే బ్రెట్ లీ... తాజాగా, మారువేషంలో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న చిన్నారులతో కలసి క్రికెట్ ఆడి సందడి చేశాడు. వృద్ధుడి వేషంలో బయటకు వచ్చిన బ్రెట్ లీ... క్రికెట్ ఆడుతున్న చిన్నారుల వద్దకు వెళ్లి... తాను కూడా ఆడతానని అడిగి మరీ ఆడాడు.

తొలుత తనకు క్రికెట్ తెలియదని చెప్పిన ఆయన...  ఆ తర్వాత బౌలింగ్, బ్యాటింగ్ లో తన టాలెంట్ చూపి చిన్నారులను ఆశ్చర్యానికి గురి చేశాడు. చాలా బాగా ఆడారు, ఇంత మంచి క్రికెట్ ఆడటం మీకు ఎలా వచ్చు? అని చిన్నారులు ప్రశ్నించడంతో... చివరకు తన మారువేషాన్ని తీసివేశాడు. సాక్షాత్తు బ్రెట్ లీ తమ ముందు ఉండటంతో... చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చి బ్రెట్ లీ సంతోషపెట్టాడు. 
brett lee
gully cricket
mask
cricket
boys
mumbai

More Telugu News