Prabhas: ప్రభాస్ స్టార్ డమ్ చూపించరు: శ్రద్ధా కపూర్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగు 'అబుదాబి'లో జరుగుతోంది. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న శ్రద్ధా కపూర్, తాజాగా ప్రభాస్ గురించి స్పందించింది.

"ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆయన సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వుంది. మాస్ హీరో అనిపించుకున్న ఆయనకి అమ్మాయిల్లో ఇంతటి క్రేజ్ ఉండటం ఆశ్చర్యం. అయినా సెట్లో ఆయన అందరితోను చాలా కలుపుగోలుగా .. సరదాగా వుంటారు. తన స్టార్ డమ్ ను ప్రదర్శించకుండా, అందరికీ అందుబాటులో ఉండటమనేది ఆయనలో నాకు బాగా నచ్చిన లక్షణం" అని చెప్పుకొచ్చింది.  
Go Back to Shorts
Prabhas
shraddha kapoor

More Telugu News