Pawan Kalyan: నన్ను తట్టిలేపే నిశ్శబ్ద యోధులు: పవన్ కల్యాణ్

  • 'జల సాధన సమరం' కవర్ పేజీ పోస్టు
  • ఆపై శేషేంద్ర రాసిన ఓ కవిత కూడా
  • వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ పోస్టు
ఈ సమాజంలోని ఎంతో మంది గొప్ప రచయితలు తనకు స్ఫూర్తినిస్తూ, తట్టి లేపుతుంటారని వారంతా నిశ్శబ్ద యోధులని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 9:12 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో తన అభిమాన రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన 'జల సాధన సమరం' పుస్తకం కవర్ పేజీని పోస్టు చేసిన ఆయన, మరో అభిమాన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఓ కవితను పోస్టు చేశారు.

"మహితాత్ములు ఎందరు భువిలో
శ్వాస పీల్చి చాలించారో
భూమి మీద నిశబ్దంగా
నడిచి నిష్క్రమించారో
మైకు ఒక్కటి ముట్టలేదు
పత్రికలో మెట్టలేదు
వాళ్లంతా నడిచిన దారులు
వార్తలుగా మారలేదు
మెరిసే మకుటుం మినహా
శిరసె కనిపించని నూతన
రాజులు ఎంగిలి కూతలు
పేజీలైపోతుంటే
చప్పుడు చెయ్యని అడుగులు
చరిత్రలోకెక్కలేదు" అన్న కవితను పవన్ పోస్టు చేశారు.
Pawan Kalyan
Twitter
Guntur Seshendra Sarma

More Telugu News