Himalayas: హిమాలయాల్లోని కేదార్ నాథ్ ఆలయంలో పరమశివుడిపై లేజర్ షో... మీరూ చూడండి!

  • ఆరు నెలలు మంచుతో కప్పబడే కేదారేశ్వరుడు
  • ఆదివారం నాడు తెరచుకున్న ఆలయం తలుపులు
  • భక్తుల కోసం లేజర్ షో ఏర్పాటు
సంవత్సరంలోని ఆరు నెలల సమయం మంచుతో కప్పబడి, మిగతా ఆరునెలలూ భక్తుల కొంగుబంగారంగా నిలిచే కేదార్ నాథ్, కేదారేశ్వరుడి ఆలయం తలుపులు నిన్న తెరచుకోగా, మరింత మంది భక్తులను ఆకర్షించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక హంగులను సమకూర్చింది. ఇందులో భాగంగా ఆలయం ముందు లేజర్ షోను ఏర్పాటు చేశారు.

పరమశివుడి విభిన్న అవతారాలను చూపుతూ సాగిన ఈ లేజర్ లైట్ షో వీడియో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయం తెరిచిన తొలిరోజు వందలాది మంది భక్తులు స్వామివారిని సందర్శించుకున్నారని, ట్రెక్కింగ్ రూట్ లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తెలిపింది. పరమేశ్వరునిపై లేజర్ షోను మీరూ చూడవచ్చు.
Himalayas
Kedarnath
Lord Siva
Laser Show

More Telugu News