Congress: అప్పుడు ఇక నా పని అయిపోయిందనుకున్నా.. 15 రోజులు సెలవు ఇవ్వండి!: రాహుల్ గాంధీ

  • రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
  • అత్యవసర ల్యాండింగ్
  • భగవంతుడిని స్మరించుకున్నానన్న కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఇటీవల సాంకేతిక లోపంతో కర్ణాటకలోని హుబ్బళి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. విమానంలోని ప్రయాణికులు అందరూ భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకుంటే రాహుల్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన జనాక్రోశ్ సభలో రాహుల్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక తన పని అయిపోయిందని అనుకున్నానని తెలిపారు.

విమానం ఒక్కసారిగా 8 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు జారడంతో అంతా అయిపోయిందనుకున్నానని పేర్కొన్నారు. ఆ సమయంలో భగవంతుడిని స్మరించుకున్నానని, కైలాస్ మానస సరోవర్‌ను సందర్శించాలనుకున్నానని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో మానస సరోవర్ సందర్శనకు వెళ్తానన్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే యాత్రకు వెళ్లేందుకు తనకు 15 రోజుల సెలవు కావాలని రాహుల్ కార్యకర్తలను అనుమతి కోరారు.
Congress
Rahul Gandhi
Karnataka

More Telugu News