Telugudesam: పోటాపోటీ: రేపు టీడీపీ 'ధర్మపోరాట సభ'... వైసీపీ ‘వంచన వ్యతిరేక దీక్ష’!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా రేపు తిరుపతిలో టీడీపీ 'ధర్మపోరాట సభ' నిర్వహించనుంది. తిరుపతిలో ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలను వివరిస్తూ కేంద్ర సర్కారు తీరును ఎండగట్టనుంది. రేపు మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్న తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా ఇటీవల చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహార దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే.

‘వంచన వ్యతిరేక దీక్ష’ చేయనున్న వైసీపీ..    ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, ఏపీ ప్రభుత్వాల తీరుకి నిరసనగా వైసీపీ రేపు విశాఖపట్నంలో ఈ దీక్ష చేయనుంది. విశాఖపట్నంలోని మహిళా డిగ్రీ కాలేజీ ఎదుట ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ దీక్ష జరుగుతుంది. ‘వంచన వ్యతిరేక దీక్ష'లో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.                              
Go Back to Shorts
Telugudesam
YSRCP
Tirupati
Vizag

More Telugu News