Jana Sena: 2019 ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై స్పష్టతనిచ్చిన పవన్ కల్యాణ్ 'జనసేన'
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఈ రోజు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అన్ని జిల్లాలు, నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తాము తమ కార్యకర్తలతో చర్చించామని అన్నారు. లక్షలాది మంది యువత తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనుక ఉన్నారని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులోపు పవన్ కల్యాణ్.. జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తారని, జనసేన దశ, దిశ ఎలా ఉండబోతుందో వివరిస్తారని నేమూరి శంకర్ గౌడ్ అన్నారు.