Chandrababu: చంద్రబాబు నాయుడు, నేను బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఫ్రంట్ విషయంపై త్వరలో ఆయనతో చర్చిస్తా!: కేసీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని, తామిద్దరం కలిసి గతంలో ఏడేళ్లు పని చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమ ఫ్రంట్‌పై చంద్రబాబు నాయుడుతో కూడా తాము తప్పకుండా త్వరలో చర్చిస్తామని చెప్పారు. ఈ రోజు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై డీఎంకే నేతలతో పాటు పలువురితో చర్చించడానికి చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే.

డీఎంకే నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోన్న ఈ ఫ్రంట్‌ విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాలని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామని, రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున పంటసాయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ఆహ్వానించామని అన్నారు. తమ ఫ్రంట్‌పై 2, 3 నెలల చర్చల తరువాత ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
KCR

More Telugu News