Nellore District: కారులో రాసలీలలు... భర్త చూడటంతో ప్రియుడితో కలసి దాడి!

  • సహోద్యోగితో సంబంధం పెట్టుకున్న ఉద్యోగిని
  • వదిలించుకునేందుకు గృహహింస కేసు
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను కాదని సహోద్యోగితో వివాహేతర బంధం పెట్టుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని, భర్తకు పట్టుబడిపోయి, ఆపై ప్రియుడితో కలసి అతనిపై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళకు ఎనిమిది సంవత్సరాల క్రితం తిరుపతిరావు అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది.

ఆరు నెలల క్రితం ఆమె సంగం మండల తహసీల్దారు కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్ గా బదిలీ మీద వచ్చింది. అక్కడే వీఆర్ఓగా పనిచేస్తున్న రామకృష్ణ పరిచయం అయ్యాడు. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆపై ఆమె ప్రవర్తనలో మార్పు రాగా, భర్త నిలదీశాడు. అతన్ని వదిలించుకోవాలన్న ఆలోచనతో భర్తపై గృహహింస కేసు పెట్టిందా ఇల్లాలు.

అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. భర్త దూరంగా ఉండటంతో రామకృష్ణకు మరింతగా దగ్గరైందామె. ఇద్దరూ బహిరంగంగానే కలసి తిరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఓ కారులో వెళుతుండగా తిరుపతిరావు చూసి వెంబడించాడు. కారును పొలాల్లో ఆపి అందులోనే రాసలీలలకు దిగగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఫొటోలు కూడా తీశాడు. దీన్ని గమనించిన వారు అతనిపై దాడికి దిగారు. ఈ దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
Nellore District
Harrasment
Employee
Extra Marital Affair

More Telugu News