Tamilnadu: తమిళనాడు నెక్ట్స్ సీఎం రజనీకాంతే: కమల్ సోదరుడు చారుహాసన్ కీలక వ్యాఖ్య

  • ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన చారుహాసన్
  • పరిపూర్ణ విజయం సాధిస్తారు
  • కమల్ కు సీఎం చాన్స్ తక్కువే
తమిళనాడు రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి రజనీకాంత్ అని కమలహాసన్ సోదరుడు చారుహాసన్ జోస్యం చెప్పారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, తనను కన్నడ వ్యక్తని విమర్శిస్తున్న వారికి తన పరిపూర్ణ విజయంతో రజనీ సమాధానం చెప్పనున్నారని అన్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు రజనీకాంత్ తో పోల్చుకుంటే తన సోదరుడు కమల్ కు చాలా తక్కువని అన్నారు. కమల్ ను ప్రజలు మంచి నటుడిగా చూస్తారని, రాజకీయాల్లో మాత్రం అంత మద్దతు ఉంటుందని తాను భావించడం లేదని అన్నారు. కాగా, చారుహాసన్ ఆది నుంచీ రజనీకి మద్దతు పలుకుతున్నారు.
Tamilnadu
Rajanikant
Kamal Haasan
Charu Haasan

More Telugu News