Bharath Ane Nenu: ‘భరత్ అనే నేను’ సినిమావి ఒరిజినల్ కలెక్షన్లే.. నేనే ప్రకటించాను: డీవీవీ దానయ్య

  • రూ.161.28 కోట్ల గ్రాస్ వచ్చింది
  • ఎటువంటి అసత్యం లేదు
  • మా సంస్థకు పెద్ద విజయం లభించింది
  • కొరటాల శివ, మహేశ్‌కి ధన్యవాదాలు
‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా కలెక్షన్లను తానే అఫీషియల్‌గా ప్రకటించానని, ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రూ.161.28 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. ఇందులో ఎటువంటి అసత్యం లేదని, అవి ఒరిజినల్ కలెక్షన్లని తెలిపారు. మ‌హేశ్‌ బాబు, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఆ సినిమా యూనిట్ హైదరాబాద్‌లో విజయోత్సవ సభ నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా డీవీవీ దానయ్య మాట్లాడుతూ... తమ సంస్థకు ఇంత పెద్ద విజయం ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు, హీరోకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణ విషయంలో తాను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారికి సారీ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమా తరువాత తనకు మరింత పేరు వచ్చిందని, తాను ఎక్కడ కనిపించినా తనతో చాలామంది ఫొటోలు దిగాలని చూస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
Bharath Ane Nenu
Mahesh Babu
dvv

More Telugu News