galla: మీకు సన్మానం చేస్తారట.. మీ కోసం గుంటూరు ప్రజలు వెతుకుతున్నారు!: గల్లా జయదేవ్‌కు 'జనసేన' చురక

  • పార్లమెంటులో 100 స్పీచ్‌లు ఇచ్చానన్న గల్లా
  • అందుకు ప్రజలు సన్మానం చేయాలనుకుంటున్నారన్న జనసేన
  • చివరిసారిగా గుంటూరుకి ఎప్పుడు వచ్చారని ప్రశ్న
విమర్శ, ప్రతి విమర్శ.. అన్నింటికీ ట్విట్టరే వేదికగా మారుతోంది. టీడీపీ ఎంపీ, జనసేన పార్టీకి మధ్య ట్విట్టర్‌ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా గల్లా జయదేవ్ ఒకసారి లోక్‌సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని నిన్న జనసేన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో చేసిన ట్వీట్‌కి గల్లా జయదేవ్‌ దీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. తాను లోక్‌సభలో సెంచరీ కొట్టానని, గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 100 సార్లు మాట్లాడానని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, గల్లా ట్వీట్‌పై మళ్లీ జనసేన పార్టీ స్పందించి మరోసారి చురకలంటించింది. "మీరు పార్లమెంటులో 100 స్పీచ్‌లు ఇచ్చిన సందర్భంగా మీకు సన్మానం చేయడానికి మీ నియోజక వర్గ ప్రజలు మీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నారు. చివరిసారిగా మీరు గుంటూరుకి ఎప్పుడు వచ్చారు? మీ బ్యాటరీలు ఛార్జ్‌ చేసుకోండి" అని జనసేన పేర్కొంది.
galla
Guntur District
Jana Sena

More Telugu News