Tirumala: తిరుమలలో మళ్లీ అగ్నిప్రమాదం.. ఆలయం చుట్టూ అలముకున్న పొగలు

  • పోటులో సంభవించిన అగ్నిప్రమాదం
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
  • ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆగని అగ్నిప్రమాదాలు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే వంటశాల పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. గత నెలలో కూడా పోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. పొయ్యిపై మరుగుతున్న నేయిలో నీరు పడిన నేపథ్యంలో మంటలు అంటుకుని ఉండవచ్చని చెబుతున్నారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. టీటీడీ అధికారులు ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ... పోటులో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పోటులో పని చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tirumala
Fire Accident

More Telugu News