mahesh babu: చాలా ఆనందంగా ఉంది: తిరుమల కొండపై మహేష్ బాబు

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్, గల్లా జయదేవ్
  • స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న మహేష్
  • మొక్కులు చెల్లించుకున్నామన్న కొరటాల శివ
సినీ నటుడు మహేష్ బాబు తన బావ గల్లా జయదేవ్ తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 'భరత్ అనే నేను' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా వీరితో పాటు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, తనకు ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ, 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయం సాధించిందని... అందుకే వెంకన్నకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామని చెప్పారు.
mahesh babu
galla jayadev
Koratala Siva
Bharath Ane Nenu
tollywood
Tirumala

More Telugu News